తీన్మార్ మల్లన్నను హాస్పటల్ లో చేర్చిన పోలీసులు

తీన్మార్ మల్లన్నను హాస్పటల్ లో చేర్చిన పోలీసులు

జర్నలిస్ట్​, క్యూ న్యూస్ అధినేత తీన్మార్​ మల్లన్న ను బ్లాక్ మెయిల్ కేసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలు లో ఉన్న మల్లన్న ..రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడం తో పోలీసులు ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

శనివారం మల్లన్న బెయిల్ రిట్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మల్లన్న భార్య మత్తమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మల్లన్నను అక్రమంగా అరెస్ట్‌ చేశారని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన 306, 511 సెక్షన్లు తొలగించాలని పిటిషనర్ కోరారు. కింది కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. ఇక ఈ కేసు సెప్టెంబర్ 14 కు వాయిదా పడింది.

తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు మల్లన్నకు నోటీసులు ఇచ్చి విచారణ చేసిన పోలీసులు, అర్థరాత్రి సమయంలో పెద్ద హైడ్రామా మధ్య తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ కోర్టు ముందు హాజరు పరిచిన మల్లన్నకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.