తిరుమ‌ల‌లో ఘ‌నంగా శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌లు

Sriramanavami
Sriramanavami

తిరుమల : శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆస్థానంలో భాగంగా రంగనాయకుల మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. అర్చకుల వేదమంత్రోవేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ పెద్ద జీయంగార్ల ఆద్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆస్థానం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీ మలయప్పస్వామివారు హనుమద్వాహనంపై మాఢవీధుల్లో ఊరేగుతారు. రాత్రి 10 గంటల నుండి 11 గంటల మధ్య బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.