తిరుమ‌ల‌లో తుపాకి క‌ల‌క‌లం

gun
gun

తిరుమ‌లః తిరుమలలో మరోసారి తుపాకి కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గంలో ఎయిర్‌ పిస్టల్ లభ్యమైంది. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన సమయంలో శ్రీవారి మెట్టు నడకదారిలో తుపాకి లభ్యమవడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.