తిరుమ‌లేశుని స‌న్నిధిలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌

Kajal agarwal
Kajal agarwal

చిత్తూరు: తిరుమల శ్రీవారిని సినీనటి కాజల్‌ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను కాజల్‌కు అందజేశారు. శ్రీనివాసుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని కాజల్‌ అన్నారు. ప్రస్తుతం తాను బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నానని.. త్వరలో శర్వానంద్‌తో ఓ సినిమా ప్రారంభం కానుందని తెలిపారు.