తిరుమ‌లకు పోటెత్తిన భ‌క్తులు!

garuda-seva-in-tirumala
garuda-seva-in-tirumala

తిరుమల: శ్రీవారి గరుడవాహనసేవను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను సరఫరా చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అలాగే గరుడవాహనసేవను తిలకించేందుకు నిన్న సాయంత్రం నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని, మంగళవారం ఉదయం 8 గంటలకే 80 శాతం గ్యాలరీలన్ని నిండిపోయాయని, లైవ్ టెలీకాస్ట్ కూడా చేస్తున్నామని చెప్పారు. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ద్విచక్ర వాహనాలను నిషేధించామని, ఎక్కడికక్కడి సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.