తిరుమలేశుని దర్శనానికి ‘రేషన్’!

తిరుమలేశుని దర్శనానికి ‘రేషన్’!
భక్తుల రద్దీ నియంత్రణకు టిటిడి కసరత్తు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేం కటేశ్వరస్వామి దర్శనం సామాన్యులకు ”భారంగా మారనుందా!,ప్రముఖులకు ”వరంకానుందా!? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు టిటిడి కూడా ఆది శగా కసరుత్తు చేపడుతోంది. ప్రస్తుతం టిటిడిలో అమలవుతున్న దర్శన విధా నంలో అంతా స్మార్ట్ఫోన్ మయంగా మారింది.స్మార్ట్ఫోన్ నుంచే శ్రీవారి దర్శ నం, వసతి, లడ్డూ ప్రసాదం పొందేందుకు చర్యలు చేపట్టారు. ఇదిలా వుంటే సామాన్యులకు దర్శనం కల్పించడంలో అనాధిగా టిటిడి పాతవిధానాన్నే కొన సాగిస్తోంది.