తిరుమలలో స్వర్ణరథంపై శ్రీవారు

tirumala vaikunta ekadasi
tirumala vaikunta ekadasi

తిరుమల: తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీవారు స్వర్ణరథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల కోలాహలం, కోలాటాల మధ్య స్వామివారు స్వర్ణరథంపై విహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.