తిరుమలలో రేపు డయల్‌ యువర్‌ ఈవో

Anil kumar singhal
Anil kumar singhal

తిరుమల: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలో అన్నమయ్య భవనంలో ఉదయం 8.30గంటల నుండి 9.30గంటల వరకు నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఈ నెల 5న జరగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాలకు ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలియచేయవచ్చని తితిదే వర్గాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. భక్తులు 0877-2263261 ఫోన్‌ నంబర్లలో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.