తిరుమలలో పొటెత్తిన భక్తులు

Devotees at TTD
Devotees at TTD

తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తులు పొటెత్తారు. వైకుంఠంలో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి వైకుంఠం వెలుపల కిలోమీటర్‌ వరకు క్యూలైన్లలో బారులు తీరారు. సర్వదర్శనానికి 24గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు,కాలినడకన వచ్చే భక్తులకు 4గంటల సమయం పడుతోంది. స్వామివారిని శనివారం 74,395 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,928భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం శనివారం 1.94కోట్లుగా ఉంది.