తిరుప్పావై: 8వ పాశురం

GODADEVI
GODADEVI


కీళ్‌వానమ్‌ వెళ్ళెను€ ఎరుమై శిరువీడు
మే§్‌ువాన్‌ పరన్దనకాణ్‌ మిక్కుళ్ళ పిళ్ళైకళుమ్‌
పోవాన్‌ పోకినా€రై ప్పో’గామల్‌ కాత్తు, ఉన్నె
క్కూవువాన్‌ వందు నినో€మ్‌, కోదుకలముడైయ
పావా§్‌ు! ఎళున్దిరా§్‌ు పాడిప్పఱై కొండు
మావా§్‌ు పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనైచ్చెను€ నాం శేవిత్తాల్‌
ఆవావెనా€రా§్‌ున్దు అరుళేలో రెమ్బావా§్‌ు
భావం: ఆకాశము తూర్పుదిక్కున తెల్లబడుచున్నది. గోపాలురు మేతమేయుట కొరకు గేదెలను వదిలినారు. పిల్లలు పనులు చేయడానికి పోతున్నారు. వారిని నీ ఇంటిముందు నిన్ను పిలుచుటకు ఆపినాము. కేశియను రాక్షసుని నోటిని చీల్చిన, చాణూర మల్లుల జంటను చంపిన, సర్వదేవతలకు దేవుడైన వానిని, కృష్ణా కృష్ణా అని పాటలు పాడి వ్రతమునకు కావలసిన ‘పర యను సాధనమును పొంది, మనమంతా కలిసి సేవించుదాం. అప్పుడు కృష్ణుడు అయ్యో, మీరే వచ్చితిరని మనపై జాలిపడి మన మంచిచెడ్డలు ఆలోచించి మనపై కృపచూపుతాడు. అనుచు వెలుపలి గోపికలు లోపల నిదురించుచున్న మరొక గోపికను మేల్కొలుపుతున్నారు.
ఫలం: ‘పర జ్ఞానం కలుగుతుంది