తిరుగులేని ‘కారు’తో కుదేలైన ప్రజాకూటమి

       తిరుగులేని ‘కారు’తో కుదేలైన ప్రజాకూటమి

TRS
TRS

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో దఫా శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ డిసెంబర్‌ 11న ప్రకటించిన ఫలితాలలో తిరుగులేని శక్తిగా కారు స్పీడ్‌ పెరగడం హర్షనీయంగా పేర్కొనవచ్చు. మాజీ పార్లమెంటు సభ్యుడు నాయకుడు లగడపాటి రాజగోపాల్‌ ప్రకటించిన సర్వే ప్రజా కూటమికే ప్రజలు పట్టం కడతారని వెల్లడించగా అందుకు విరుద్ధంగా ఫలితాలు రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు జాతీయ మీడియా సంస్థలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే మరో దఫా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని ప్రకటించాయి.

వాటి కంటే అధికంగా 88 విధాన సభ సీట్లను టిఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ముదవాహం. టి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన ప్రజా నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీ, మరో జాతీయ పార్టీ సి.పి.ఐ, తెలుగుదేశం పార్టీ ఇటీవల కాలంలో కొత్తగా పురుడుపోసుకున్న తెలంగాణ జన సమితి ప్రజా కూటమిగా జట్టు కట్టినా కానీ కేవలం కాంగ్రెస్‌ 19 స్థానాలు, తెలుగుదేశం రెండు స్థానాలతో సరిపెట్టుకోవలసిన దుస్థితి ఏర్పడింది.1956 నుండి ప్రాతినిధ్యం వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేయగా ఒక స్థానంలో కూడా బోని కొట్టని పరిస్థితి నెలకొంది.

తెలంగాణ సాధన ఏర్పాటే లక్ష్యంగా పనిచేసిన ఆచార్య కోదండరాం 2014లో ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తమకు సముచితమైన ప్రాతినిధ్యం కల్పించలేదని తెలంగాణ జన సమితి స్థాపించిన కోదండరాం పార్టీ కూడా మూడు స్థానాల్లో పోటీ చేయగా ఒక స్థానంలో గెలవకపోవడం పట్ల ప్రజలు ప్రజాకూటమి పట్ల మొగ్గుచూపలేదనే విషయం స్పష్టమవ్ఞతుంది. సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధే నినాదమే లక్ష్యంగా అణగారిన, అట్టడుగు బలహీనవర్గాలకు అన్ని రంగాల్లో వారి వారి అభివృద్ధి బాటలు వేస్తామనే సంకల్పంతో సిపిఎం పార్టీ నాయకత్వంలో ఏర్పాటై బరిలో నిలిచిన బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ కూడా ఒక స్థానంలో కూడా గెలవకపోవడం, గతంలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న సిపిఎం కూడా గెలవలేదనే వాదన వినిపిస్తోంది.

కెసిఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌, ఆసరా పథకంతో వికలాంగులకు, వృద్ధులకు, గీత, చేనేత, వితంతువ్ఞలకు ఎయిడ్స్‌వ్యాధిగ్రస్తులకు, ఒంటరి మహిళలకుపెన్షన్లు వంటి పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు జేజేలు పల్కారన్నదే సత్యం.
– ఉయ్యాల నర్సయ్యగౌడ్‌