తిరిగి ఇంటికి చేరిన కనకదుర్గ

Kanaka Durga
Kanaka Durga

మలప్పురం: శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టిన మహిళలో ఒక్కరైన మహిళ కనకదుర్గ ఆమె ఇప్పుటు ఎటకేలకు తన ఇంటికి చేరుకుంది. కోర్టు ఉత్తర్వులతో ఆమెను మలప్పురం జిల్లా అంగడిప్పురంలోని తన భర్త ఇంటిలోకి మంగళవారం అడుగుపెట్టింది. అయితే అప్పటికే ఆమె భర్త,ఇద్దరు పిల్లలను తీసుకోని వేరే ఇంటికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆమె ఖాళాగా ఉన్న ఇంటికి చేరుకుంది.  ‘కోర్టు ఉత్తర్వు వచ్చింది. దాంతో నా ఇంట్లోకి నేను అడుగుపెట్టాను. హ్యాపీనే. ఇంతకంటే చెప్పేందుకు ఏమీ లేదు. ఇవాళ నా పిల్లలను నేను చూడలేకపోయాను. వాళ్లను మరోసారి చూస్తాననే నమ్మకం నాకుంది’ అని దుర్గ తెలిపింది. అత్తమామల గురించి మాట్లాడుతూ, వాళ్లతో కలిసి ఉండటానికి తనకు ఎలాంటి ఇబ్బందీ లేదనీ, అయితే వాళ్లే తనతో ఉండేందుకు సిద్ధంగా లేరని చెప్పింది. అయితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది.