తినకపోతే మరింత బరువు

food
eating

తినకపోతే మరింత బరువు

తిండి తగ్గిస్తే బరువు తగ్గుతాము కదా అనే ఉద్దేశం, పనిఒత్తిడి, అశ్రద్ధ- ఇలా కారణం ఏదైతేనేం చాలామంది మహిళలు పొద్దుటపూట తినాల్సిన అల్పాహారాన్ని మానేస్తుంటారు. అయితే ఇదంతా వారి శారీరక, మానసిక శక్తి సామర్ధ్యాలపై ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే రోజంతా మీరు ఎంత ఆహారం తీసుకున్నా పొద్దున్నే తీసుకునే ఆహారం మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు, బరువు తగ్గేందుకు అప్పుడప్పుడు టిఫిన్లు మానేస్తే మంచిదే అనుకునే వారు ఆ తరువాత కాలంలో ఉదయం క్రమం తప్పకుండా టిఫిన్‌ చేసేవారికంటే అదనంగా బరువు పెరుగుతారని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ్య సన్నగా తక్కువ బరువుతో ఉండటమే సరైన ఆరోగ్యమనే భ్రమలో ఉండవద్దని కూడా నిపుణులు అంటున్నారు. మానసి కంగా ఒత్తిడిని అనుభవిస్తున్న వారు బ్రేక్‌ఫాస్ట్‌ని వదిలి వేయటం అసలు మంచిదికాదు. వీరు అల్పాహారం తీసుకోలేక పోయినా కనీసం ఒక పండుని అయినా తినటం మంచిది. దీనివలన ఆకలి, ఆరోగ్యం పెరుగుతాయి. పొద్దున్న ఏమీ తినకుండా స్కూలుకి వెళ్లే పిల్లలు చదువులో ఎక్కువ ప్రతిభని కనబర్చకపోవటం కూడా పరిశోధకులు గమనించారు. ఉదయం ఆహారం తీసుకోక పోవటం మెటబాలిజం రేటుని ప్రభావితం చేయడమే కాకుండా ఏకాగ్రతను తగ్గిస్తుంది.
ఎంత హడావుడిలో ఉన్నా పిల్లలకు ఉదయం టిఫిను పెట్టకుండా స్కూలుకి పంపకూడదు. మొలకెత్తిన, ఉడికించిన గింజలు, ఉడికించిన గుడ్డు, ఇడ్లీ, ఉప్మా, చపాతీ ఇవే కాదు, పళ్లను కూడా ఉదయపు అల్పాహారంగా తీసుకోవచ్చు. ్య పొద్దున్నే తృణధాన్యాలను అల్పాహారంగా తీసుకున్న మహిళలు ఇతర ఆహారాన్ని తీసుకున్న వారికంటే నాజూకుగా ఉన్నట్టు గమనించారు. ఈ ఆహారంలో కొవ్వు కేలరీలు తక్కువగా ఉండి, పీచు, ప్రొటీన్లు ఎక్కువశాతంలో ఉంటాయి. ఈ కారణంగా త్వరగా చక్కగా జీర్ణమవుతాయి. వీటితో పాటు పాలు తీసుకుంటే కాల్షియం లభించి అది శరీర బరువుని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. ఇపుడు చాలా ఇళ్లలో ఉదయపు ఆహారంగా బ్రెడ్‌ని తీసుకుంటున్నారు. ప్లెయిన్‌ బ్రెడ్డే కాకుండా పలురకాల బ్రెడ్‌లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. బ్రెడ్‌తో పాటు గుడ్డుని ఉడికించి, ఆమ్లెట్‌ వేసుకుని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవటం కూడా మంచి పద్దతే. ్య గుడ్డులో ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉంటుంది. గుడ్డులో ఉండే కొవ్వు ప్రధానంగా పచ్చసొనలోనే ఉంటుంది. ఇది 450 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. సాధారణ కొలెస్ట్రాల్‌ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం ఒక గుడ్డుని తినవచ్చు. ్య అదే మధుమేహం ఉన్నవారైతే వారానికి రెండు గుడ్లు తీసుకోవచ్చు.
గుడ్డులోని పచ్చసొన వేడి అని, అరగటం కాస్త కష్టమని ఆయుర్వేదం అంటుంది. అదే తెల్లసొన మాత్రం చలువ చేస్తుంది, ప్రొటీన్లు ఎక్కువగా కలిగి ఉంటుంది. గుడ్డు తెల్లసొనలో 16శాతం ప్రొటీస్లు ఉంటే పచ్చసొనలో తొమ్మిదిశాతం మాత్రమే ఉంటాయి. ఇక పళ్లు-నీరు శాతం ఎక్కువ కలిగి ఉండే పళ్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు చక్కగా పనిచేస్తాయి. పళ్లనుంచి మనకు మెదడు చురుగ్గా పనిచేయడానికి తగిన గ్లూకోజ్‌ కూడా లభిస్తుంది. అల్పాహారంగా తీసుకోదగిన పళ్లలో యాపిల్‌, అరటిపళ్లు, బొప్పాయి ప్రధానమైనవి.

యాపిల్‌లో ఉండే ఫ్రూట్‌ షుగర్‌ మలబద్ధకాన్ని నివారించడంలో విశేషంగా పనిచేస్తుంది. దీనిలో ఇతర ఏ పండు లోనూ లేనంత స్థాయిలో ప్రాస్ఫేటు దొరుకుతుంది. ఇందులో విటమి న్లు, ఖనిజాలు, అమినో యాసిడ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.
అరటిపండు కూడా మలబద్ధకాన్ని నివారిస్తుంది. మూత్రం సాఫీగా జారీ అయ్యేలా చేస్తుంది. ఇందులో ఉన్న పెక్టిన్‌ కారణంగా ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గించగలుగుతుంది. యాపిల్స్‌లో కంటే అరటిపండులో పెక్టిన్‌ హెచ్చుస్థాయిలో ఉంటుంది. ఒక పండిన అరటిపండులో 100కేలరీలు, తగిన మోతాదులో పీచు లభిస్తాయి. ్య ఇక బొప్పాయి, ఇందులో కెరొటెనాయిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను శుభ్రం చేయటంలో ముఖ్యపాత్రని పోషిస్తుంది. మూత్ర వ్యవస్థకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. పొద్దున్నే బొప్పాయిని తినటం శరీరానికి మరింత మంచిది. ఎందుకంటే ఉదయం పూట శరీరంలో ఉండే ఆమ్లతత్వాన్ని తగ్గించగలుతుంది. అయితే పళ్లరసానికి బదులు పళ్లను నేరుగా తినటమే మంచిది. ఎందుకంటే పళ్లరసాల ద్వారా మనం కొంత పీచు పదార్థాన్ని వదులుకోవలసి వస్తుంది. మరికొన్ని పోషకాలు కూడా కోల్పోతాము. ్య పళ్ల, కూరగాయల రసాల్లో శరీరానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్‌ నుంచి మనల్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సిట్రస్‌ పళ్లరసంలో మనకు విటమిన్‌-సి పుష్కలంగా లభిస్తుంది. అదే ఆకు పచ్చని కూరగాయల్లో అయితే విటమిన్‌ ఇ దొరుకుతుంది. రుచికర మైన, బలవర్థకమైన అల్పాహారాన్ని తీసుకోవటం ద్వారా పొద్దున్నే ఉండే బద్దకాలు, దిగుళ్లు ఏమైనా ఉంటే పటాపంచలైపోయి ఉత్సాహకెరటాలే అవుతారు మీరు అని ఆహార నిపుణులు ఊరిస్తున్నారు మరి.