తితిదే ప్రధాన అర్చకుడిపై ఆరోపణలు

Priest Ramana Dixith
Priest Ramana Dixith

తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న వేకువజామున తన కుమారుడు వెంకటపతి దీక్షితులు, ఇద్దరు మనవళ్లతో మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రెండేళ్లుగా విధుల్లో లేని వెంకటపతిదీక్షితులు, ఆయన ఇద్దరు కుమారులు నిబంధనలకు విరుద్ధంగా మహాద్వారంలో నుంచి వెళ్లడం వివాదస్పదంగా మారింది. అంతేకాకుండా, శ్రీవారి గర్భగుడిలోకి కూడా వెంకటపతిదీక్షితులు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ విషయం తెలిసిన తితిదే ఉన్నతాధికారులు ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాలల్లో సూర్యప్రభ వాహనంపై తన కుమారుడు వెంకటపతి దీక్షితులకు విధులు కేటాయించి రమణదీక్షితులు విమర్శలకు గురై అయ్యారు. తాజాగా, ఈ వివాదంలో ఆయన చిక్కుకున్నారు. మహాద్వారం గుండా ఆలయ అర్చకులు, ఉన్నతాధికారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రధాన అర్చకుని సతీమణి మినహా మిగిలని కుటుంబీకులు బయోమెట్రిక్‌
లేదా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచి ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది.