తితిదే అధికారుల నిర్లక్ష్యం.. లడ్డూ ప్రసాదం అంబులెన్స్‌లో తరలింపు

Thirupathi Laddu
Thirupathi Laddu

చిత్తూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం సాక్షాత్తు ఏడుకొండలస్వామికి ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాల ట్రేల తరలింపుపై ఆలయ అధికారులు నిర్లక్ష్యం ఆదివారం మరోసారి బహిర్గతమైంది. శ్రీవారి ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లడ్డూ ప్రసాదాల ట్రేలను  అంబులెన్స్‌లో రవాణాధికారులు తరలించారు. దీంతో తితిదే అధికారుల తీరుపై భక్తులు మనస్తాపం చెందారు.