తార‌ల న‌గ్న‌చిత్రాలు హ్యాక్‌.. జైలు శిక్ష‌

Judgement
Verdict

జెన్నిఫర్ లారెన్స్ వంటి పేరుపొందిన హాలివుడ్ తారల నగ్నచిత్రాలను దొంగిలించి ఇంటర్నెట్‌లో పంపిణీ చేసిన హ్యాకర్‌కు అమెరికా కోర్టు 8 నెలల జైలుశిక్ష విధించింది. 2014లో జరిగిన ఈ హ్యాకింగ్ సంచలనం సృష్టించింది. అప్పట్లో జెన్నిఫర్ దీన్ని లైంగికనేరంగా పరిగణించి కఠినశిక్షలు విధించాలని పిలుపునిచ్చింది. హ్యాకర్ గారఫానోకి కనెక్టికట్ రాష్ట్రంలోని బ్రిజ్‌పోర్ట్ జిల్లా న్యాయస్థానం 8 నెలల శిక్షతోపాటుగా మూడేండ్ల పర్యవేక్షణన విధించింది. గారఫానో యాపిల్ ఆన్‌లైన్ భద్రతావిభాగం ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకుని బాధితుల యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ సంపాదించేవాడు. తర్వాత వాటిని ఉపయోగించి ప్రైవేటు యాపిల్‌క్లౌడ్ అకౌంట్లలోకి జొరబడేవాడు. అలా 240 మంది ప్రముఖులు, సామాన్యుల ఖాతాల్లోకి తొంగిచూశాడు. వారికి చెందిన వ్యక్తిగత చిత్రాలను దొంగిలించి నెట్‌లో పంపిణీ చేశాడు. తద్వారా డబ్బులు సంపాదించి ఉంటాడని కూడా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతడు తన బాధితుల ఏకాంతాన్ని బట్టబయలు చేశాడని వారు పేర్కొన్నారు. 10 నుంచి 16 మాసాల శిక్ష విధించాలని సిఫారసు చేశారు. డిఫెన్స్ న్యాయవాదులు తమ క్లయింటు మారాడని, కనుక తక్కువ శిక్ష విధించాలని కోరారు. కానీ ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేకుండా కోర్టు 8 నెలల శిక్ష విధించింది.