తానా ఆద్వర్యంలో ఖమ్మంలో 5k రన్

తానా ఆద్వర్యంలో ఖమ్మంలో 11వ తేదీన నిర్వహించిన 5k రన్ జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ సభ్యుడు పంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అజయ్ కుమార్, ఎమ్మెల్సి లక్ష్మీనారాయణ తదితరులు హాజరైయ్యారు. తానా తదుపరి అద్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తానా ఫౌండేషన్ అద్యక్షుడు శృంగవరపు నీరంజన్లు, తానా తరపున నేతృత్వం వహించారు. సినీతారలు శ్రీకాంత్, శివాజీ రాజా, శ్రీనివాస్ రెడ్డి, హేమ, తారకరత్న, సురేష్, అనితా చౌదరి, ఉత్తేజ పరచారు. కార్యక్రమంలో కలెక్టర్ లోకేష్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు గడిపల్లి కవిత, నగర మేయర్ పాపాలాల్, కమిషనర్ సందీప్ కుమార్ ఝూ, ఆర్డీవో పూర్ణచంద్ర కురివెల్ల ప్రవీణ్ కుమార్, దొడ్డారవి తదితరులు పాల్గొన్నారు.