తాతయ్యకు నచ్చని ముద్దు సన్నివేశాన్ని తొలగిస్తాం: దర్శకుడు

Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga

హైదరాబాద్‌: వీహెచ్‌ తాతయ్య ‘అర్జున్‌ రెడ్డి సినిమా చూసి.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వాటిని తొలగిస్తామని
ఆ చిత్ర దర్శకుడు వంగ సందీప్‌ రెడ్డి చెప్పారు. బస్సులపై ముద్దుతో ఉన్న చిత్ర దృశ్యాలు తాతయ్య నచ్చకపోవడంతో
ఆ సన్నివేశాన్ని తొలగించామని, థియేటర్లలో కూడా ఆ పోస్టర్‌ లేకుండా చేశామని చెప్పారు. ముద్దు సన్నివేశం
ఎమోషన్‌ను మాత్రమే పోస్టర్‌ ద్వారా ప్రమోట్‌ చేశామే తప్ప, వేరే ఉద్ధేశం లేదని దర్శకుడు చెప్పారు.