తాజ్మహల్ సందర్శన టికెట్ ధరలు పెంపు

ఆగ్రా: తాజ్మహల్ టికెట్ ధరను అధికారులు పెంచేశారు. తాజ్ లోపలికి వెళ్లి చూడాలంటే ఇప్పుడు ఆదనంగా మరో రూ.200 చెల్లించాల్సిందేనని భారత పురావస్తుశాఖ చీఫ్ ఆర్కియాలజీస్ట్ వసంత్ స్వర్ణాకర్ వెల్లడించారు. ఈరోజు నుండి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. 17వ శతాబ్దానికి చెందిన తాజ్మహల్ లోపలికి వెళ్లి చూసేందుకు సోమవారం నుంచి దేశీయ సందర్శకులు రూ.250 చెల్లించాలని, విదేశీ పర్యటకులు రూ.1300 చెల్లించి టికెట్ తీసుకోవాలని తెలిపారు. సార్క్ దేశాలకు చెందిన సందర్శకులు రూ.740 చెల్లించాలని వసంత్ స్పష్టంచేశారు.