తాజ్‌మహల్‌ అందమైన శ్మశానం: మంత్రి అనిల్‌ విజ్‌

Anil Vij

దిల్లీ: చారిత్రాక కట్టడం, ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్‌పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తాజ్‌మహల్‌
ఓ శివాలయం అని, దాన్ని తేజోమహాల§్‌ు అని పిలిచేవారని బిజెపి ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజాగా హరియాణకు చెందిన మంత్రి తాజ్‌మహల్‌ ఓ అందమైన శ్మశానం అంటూ వ్యాఖ్యలు చేయడం తీవ్ర
దుమారం రేపుతోంది. హరియాణ మంత్రి అనిల్‌ విజ్‌ నేడు తాజ్‌ వివాదంపై స్పందించారు. ‘తాజ్‌మహల్‌ ఒక
అందమైన శ్మశానం. అందువల్ల దాన్ని దూరదృష్టంగా భావిస్తూ.. ప్రజలెవరూ దాని బొమ్మలను ఇళ్లలో పెట్టుకోరు
అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పర్యాటక బుక్‌లెట్‌లో తాజ్‌మహల్‌ ప్రస్తావన లేకపోవడంతో
వివాదానికి తెరలేపింది. చిన్న తప్పిదం వల్లే ఇలా జరిగిందని, కావాలని చేయలేదని యుపి ప్రభుత్వం స్పష్టం
చేసినప్పటికీ దీనిపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ బిజెపి శాసనసభ్యుడు సంగీత్‌ సోమ్‌
వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్‌ భారత సాంస్కృతిర చరిత్రలో ఓ కళంకమని, దాన్ని నిర్మించిన మొఘల్‌
చక్రవర్తులు దేశద్రోహులంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దేశంలో దుమారం సృష్టించిన విషయం విదితమే.