తాజా రికార్డుస్థాయిలో స్టాక్‌ మార్కెట్లు

markets
markets

తాజా రికార్డుస్థాయిలో స్టాక్‌ మార్కెట్లు
రుతుపవనాలే వెన్నుదన్ను

ముంబయి, మే 31: మార్కెట్లు తాజా రికార్డు స్థాయిలను నమోదుచేసాయి. నిఫ్టీ 50సూచి 9600 మార్కును అధిగమించింది. రుతుపవ నాలు, వర్షాలు రాక సానుకూలంగా ఉంటుందన్న వార్తలు ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచాయి. వార్షిక వర్ష పాతం 70శాతం వరకూ దక్షిణ కేరళ తీరప్రాంతా నికి మంగళవారానికే చేరుకున్నట్లు వార్తలు వచ్చా యి. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులు మరింతపెరిగి ఆర్థికవృద్ధికి దోహదం చేస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లు పెంచాయి. లక్షద్వీప్‌, కోస్తా కర్ణాటక తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాలు వచ్చే24 గంటల్లో వర్షాలు ముంచెత్తుతాయని అంటున్నారు. నాలుగో సారి కూడా బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 31,170 పాయింట్లు చేరుకుంది. 60పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 50 సూచి మూడోసారి వృద్ధిని చూపించింది. 19 పాయింట్లు పెరిగి 9624 పాయింట్లకు చేరింది.

బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ 0.8శాతం, స్మాల్‌క్యాప్‌ 0.5 శాతంపెరిగాయి. మార్కెట్లపరంగా బిఎస్‌ఇ సెన్సెక్స్‌ లో 1427కంపెనీలు ప్రనతికూలంగా నడిస్తే 1168 కంపెనీలు పెరిగాయి. బిఎస్‌ఇ హెల్త్‌కేర్‌ అన్ని విభా గాలకంటే ఎక్కువ లాభాల్లో ఉన్నాయి. పదిరోజుల నష్టాలను రికవరీ చేసుకున్నాయి. అరబిందో ఫార్మా ఊతం ఇచ్చింది. లాభాల కంపెనీల్లో అరబిందో ఫార్మా 13.4శాతం పెరిగింది. మూడేళ్లలో ఈ కంపెనీఒక్కటే గరిష్టంగా పెరిగింది. అమెరికాలో ధరల పోటీఈ కంపెనీని ఎక్కువ ప్రభావితంచేయ లేదు. అనిల్‌ధీరూభా§్‌ు కంపెనీ గ్రూప్‌ స్టాక్స్‌ 6-18శాతం పెరిగాయి. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిల యన్స్‌ డిఫెన్స్‌, రిలయన్స్‌ కేపిటల్‌, రిలయన్స్‌ పవర్‌ సంస్థలు 1-3శాతం పరిగాయి. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ వరుసగా మూడోరోజు కూడా పత నం చవిచూసింది. 18.95 రూపాయల అతితక్కు వ చూపింది. 7.5శాతం ఇంట్రాడేలో తగ్గినా ఆతర్వాతకోలుకుని రెండుశాతం దిగజారింది. ఐటిసి 1.4శాతం క్షీణించింది.

ఈ నెలలో 13.6శాతం లాభాల్లో ముగిసిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాలస్వీకరణకే మొగ్గుచూపించారు. కోల్‌ ఇండియా మూడున్నరేళ్ల దిగువస్థాయిని నమోదు చేసింది. సంస్థ 38శాతం నికరలాభాల్లో క్షీణత నమో దు చేసింది. జుబిలియంట్‌ ఫుడ్‌వర్క్స్‌ నష్టాలను తగ్గించుకుని 3.2శాతం దిగువన నమోదయింది. అంతకుముందు 13.1శాతం ఇంట్రాడేనష్టాన్ని ప్రకటిం చిన సంస్థ నికరలాభాల్లో కూడా 76శాతం క్షీణించి నట్లు వెల్లడించింది. ఇక యూరోపియన్‌ ప్రాంతంలో ఉన్న భౌగోళిక అనిశ్చితి మార్కెట్లను ప్రభావితం చేసింది. ఆసియా మార్కెట్లనుసైతం ప్రభావితంచేసిం ది.

జపాన్‌యెన్‌, బంగారం వంటి వాటిపై ఎక్కువ ప్రభావం పడింది. యూరోపియన్‌ స్టాక్స్‌ సూచి 0.2 శాతం దిగజారింది. బ్రిటన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ 0.4శాతం క్షీణించింది. ఇక ఆసియా పసిఫిక్‌షేర్లు జపాన్‌ బైట ప్రాంతంలో 0.2శాతం క్షీణించాయి. చైనా, హాంకాంగ్‌, తైవాన్‌ మార్కెట్లు మంగళవారం సెలవు ల కారణంగా మూతపడ్డాయి. జపాన్‌ నిక్కీ నిలకడ గా కొనసాగింది. దక్షిణకొరియా కోస్పి 0.4శాతం పతనం చవిచూసింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపించడంతో కోస్పికి కొంతమేర కోతపడింది.