తాగినడిపితే రూ.10వేలు జరిమానా

TRAFFIC
TRAFFIC

న్యూఢిల్లీ: ట్రాఫిక్‌ జరిమానాలను పెంచాలని, తాడి వాహనం నడిపినా, మొబైల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపినా, వేగంగానునిర్లక్ష్యంగాను వాహనాలనునడిపినా జరిమానాలు భారీగా నడుస్తున్నాయి. పార్లమెంటరీ ప్యానెల్‌ప్రతిఏటా ఈ ఉల్లంఘనులకు పదిశాతం జరిమానా పెంచాలని నిర్ణయించింది. మోటార్‌ వాహనాల సవరణ బిల్లు 2017ను ఈ ప్యానెల్‌ అధ్యయనంచేస్తోంది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు భారీగా పెంచాలనిసూచించింది. గడచిన ఏప్రిల్‌లోనే ఈబిల్లును లోక్‌సభ ఆమోదించింది.రాజ్యసభలో పెండింగ్‌లోఉంది. భారత్‌లో ఎక్కువగా రోడ్డుప్రమాదాలు తాగి వాహనాలునడపడంవల్లనే జరుగుతూన్నయని ప్యానెల్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రెండువేల రూపాయలజరిమానాను రూ.10వేలకు పెంచాలనినిర్ణయించింది. లాగే మొబైల్స్‌ మాట్లాడుతూ వాహనం నడిపితే ప్రస్తుతం ఉన్న వెయ్యిరూపాయలనుంచి ఐదువేల రూపాయలకుపెంచాలని సిఫారసుచేసింది. ఇక రెడ్‌లైట్‌ జంపింగ్‌, సీట్‌బెల్ట్‌, హెల్మట్‌ లేకుండా నడిపితే రూ.1000 జరిమానాగా నిర్ణయించింది. రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ మొత్తం ఈ సవరణలను తిరిగిపరిశీలిస్తోంది. బిజెపి ఎంపి విన§్‌ు పి సహస్రబుద్దే మాట్లాడుతూ వీటిపై ఒక నివేదిక ఇస్తామని వెల్లడించారు. మైనర్లు వాహనాలునడపిన కారణంగా ఘోర ప్రమాదాలు జరిగితే 25వేల జరిమానా,మూడేళ్ల జైలు విధించే సవరణలు కూడా తెచ్చారు. అలాగే బాధిత కుటుంబాలకు పదిరెట్లు పరిహారం అందించేవిధంగా సవరణలు తెచ్చారు. వాహన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని సరళీకృతంచేయాలని, ఆన్‌లైన్‌లోనే లెర్నర్‌ ఇష్యూ ఇవ్వాలని, వాహనరీకాల్‌ పాలసీ తప్పనిసరి చేయాలని, వాహనాలుమరమ్మతుల పాలయితే వెంటనే పిలిపించాలని కూడా ఈ చట్టంలోప్రతిపాదించారు. రాజ్యసభలో జనవరి మొదటివారంలో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని అంచనా. పార్లమెంటు శీతాకాలసమావేశాలు జనవరి ఐదవ తేదీతోముగుస్తున్నాయి. ప్యానెల్‌లోని 24 మందిసభ్యుల్లోఏడుగురు ఈ బిల్లుపై తమ అసమ్మతిని తెలియజేసారు. వారిలోప్రమోద్‌ తివారి, బికె హరిప్రసాద్‌, డిఎంకె కణిమోజి, ఎఐఎడిఎంకె నవనీత కృష్ణన్‌లు నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ హరిప్రసాద్‌, సిపిఎం సిపినారాయణన్‌లు డీలర్లు యజమానుల తరపున వాహనాలనురిజిష్టరుచేయడాన్ని వ్యతిరేకించారు. ఇది ప్రజామోదానికి వ్యతిరేకమని అన్నారు ఈ సవరణ ప్రతిపాదనలు జాప్యం లేకుండాను, పారదర్శకతతో కూడిన డీలర్‌నెట్‌వర్క్‌కఅమలుకు దోహదంచేస్తుందని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ చెపుతున్నా సభ్యులు అంగీకరించలేదు. అలాగేరిజిస్ట్రేషన్‌నెంబర్లకోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుచేసుకునేవిధానం అమలుకు తెస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎంపిలుప్రమోద్‌ తివారి, హరిప్రసాద్‌; సిపిఎం నారాయణన్‌లు కేంద్రప్రభుత్వానికి ఈ బిల్లులో సవరణలు తెచ్చే అధికారాలు దఖలుపరచడం, అంతర్‌రాష్ట్ర రవాణా సరుకులు,ప్రయాణీకులను తనిఖీలు చేయడమంటే రాష్ట్రాల హక్కులు హరించడమేనని అన్నారు. అయితే సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ వివరణ ఇచ్చామని, వాటికే తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈబిల్లు ఒకసారి ఆమోదం పొందితే 2 ఏళ్ల పాతమోటార్‌ వాహనచట్టం మరుగునపడుతుంది. పాతచట్టానికి 2001లో సవరణలు తెచ్చారు.