తస్లీమాను విమానం నుంచి వెనక్కి పంపిన అధికారులు

తస్లీమాను విమానం నుంచి వెనక్కి పంపిన అధికారులు
ఔరంగాబాద్: బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ముంబైనుంచి ఇక్కడకు రాగానే పోలీసులు విమానాశ్రయంనుంచే ఆమెను వెనక్కు పంపించారు. ఎఐఎంఐఎం శాసనసభ్యులు, మరికొందరు కార్యకర్తలు విమానాశ్రయం వెలుపల తస్లీమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఆమెను విమానాశ్రయంనుంచే తిరిగి ముంబైకి పంపించారు. నగరంలో శాంతిభద్రతలకు ముప్పు కలుగకుండా చూడటంలో భాగంగా తస్లీమాను విమానాశ్రయంనుంచే వెనక్కు పంపినట్లు డిసిపి (జోన్2) రాహుల్ శ్రీరామ్ తెలిపారు.