తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

Suspended
Suspended

కడప: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఓ ఉద్యోగిని జిల్లా కలెక్టరు బాబూరావునాయుడు సస్పెండు చేశారు. కలశపాడు మండలం శంకవరం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న జాషువాను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. తన బాగోగులు చూడకుండా నిర్లక్ష్యం చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడంటూ జాషువా తండ్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కలెక్టరు వాకబు చేసి, నిజమేనని తేలడంతో జాషువాను సస్పెండు చేశారు. ఎవరైనా ఉద్యోగులు తమ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టరు ఈ సందర్భంగా హెచ్చరించారు.