తల్లడిల్లుతున్న ‘తెల్లబంగారం’ రైతులు

FARMERS
FARMERS

తల్లడిల్లుతున్న ‘తెల్లబంగారం’ రైతులు

జూదంలా మారిన పత్తి సాగు.. ఆంక్షల చట్రంలో సిసిఐ
అనుకూలించని వాతావరణం…
భారంగా మారిన పెట్టుబడులు   .. ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో సిసిఐ
గణనీయంగా తగ్గనున్న పత్తి దిగుబడి

గట్టుపల్లి శ్రీనివాసరావు / గుంటూరు

కోటి ఆశలు పెట్టుకుని తెల్లబంగారం సాగు చేసిన రైతులు నష్టాలఘాటుకు తల్లడిల్లి పోతున్నాడు. వాతావరణం అనుకూలించక పోవటంతో సాగు సంక్షోభంలో చిక్కుకుంది.సాగు ప్రారంభంలో ముఖం చాటేసిన వానలు రైతన్నలను చావుదెబ్బతీశాయి. ఈప్రభావం పత్తిదిగుబడిపై పడింది. అధికా రంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన రైతుల్లో తొలుత ఆనందం కలిగించినా ఆతరువాత జరిగిన రుణ మాఫీ తీరు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

దీని వల్ల ఈ ఏడాది పెట్టుబడులు గణనీయంగా పెరగటం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవటంతో అందినకాడికి అధికవడ్డీకి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు నేడు పుట్టెడుకష్టాల్లో నష్టాల ఊబిలో కూరుకుపోయారు. రానున్న కాలంలో జిన్నింగ్‌ మిల్లుల మనుగడను దెబ్బ తీసే విధంగా ఉంది. కాలం అనుకూలంగా లేక పోవటంతో వాణిజ్య బ్యాంకులు పత్తి రైతులకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో వడ్డీ వ్యాపారుల నుండి అధిక వడ్డీకి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులు నిండా మునిగి పోయారు.ఇదిలా ఉండగా మద్దతు ధరను పెంచకుండా నిబంధనలను సడలించకుండా సిసిఐ,ప్రైవేటు వ్యాపారులతో చేతులు కలిపి రైతుల జేబులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పత్తి దిగుబడి నిరాశాజనకంగా ఉంది.

సిసిఐ అధికారులు ఇప్పటీకే ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దిగుబడి వచ్చే కొద్ది పాటి పత్తిలో నాణ్యత సరిగా ఉండదనే అనుమానం బయ్యర్ల నుండి వ్యక్త మవుతోంది. గతంలో మాదిరి కాకుండా ఈ సారి కేంద్ర ప్రభుత్వం పత్తి ఎగుమతిలో కొన్ని ఆంక్షలను సడలించకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలా సవాలక్ష సమస్యలు రైతు మెడకు ఉచ్చు బిగిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పత్తి సాగు కన్నా జూదమే నయమనే చందనా రైతులు సేద్యం చేస్తున్నారు. ఎప్పుడు తలరాత మారుతుందనే ఆవేదన పత్తి రైతుల్లో వ్యక్త మవుతోంది. పత్తి సాగు,దిగుబడి,ధరలు,రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బం దులపై ప్రభాత వార్త అందిస్తున్న ప్రత్యేక కథనాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో తెల్లారం సాగుదార్లు కష్టనష్టాలతో ఏటికి ఎదురీదుతున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉండటంతో సుమారు 1.70 లక్షల ఎకరాల పత్తి సాగువుతోంది. దిగుబడి 65శాతానికి పరిమిత మైంది.