తలైవా వ్యాఖ్యలపై కమల్ ఘాటు స్పందన

న్యూఢిల్లీ : స్టెరిలైట్ ఫ్యాక్టరీపై పోరాటంలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని..ప్రతీ సమస్యకు ఆందోళనకారులు రోడ్డెక్కితే తమిళనాడు శ్మశానంలా మారుతుందని తలైవా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మక్కళ్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. ఇవాళ కర్ణాటక సియం కుమారస్వామిని కలుసుకునేందుకు బయల్దేరిన ఆయన ..చెన్నై ఎయిర్పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆందోళనకారులు సంఘ వ్యతిరేకులైతే ..నేను కూడా వాళ్లలో ఒకడినే’ అని కౌంటర్ వేశారు. ‘ఉద్యమాలకు ఓ లక్ష్యం ఉంటుంది, ఐతే ఆందోళనల సందర్భంగా హింస తలెత్తితే హింసను తగ్గించాలి. అంతే కాని ఉద్యమాలను నీరుగార్చడం లేదా ఆపడం చేయకూడదు.’ అని కమల్ ఘాటుగా సమాధానమిచ్చారు.