తలాక్‌ రాజ్యాంగ ఉల్లంఘన!

Talak violation of the Constitution!
సుప్రీం కోర్టులో సవాల్‌ చేసిన ముస్లిం యువతి
నిర్ణయంపై కేంద్రం జోక్యం కోరిన ‘సుప్రీం’ ధర్మాసనం
హైదరాబాద్‌ : తలాక్‌-ఏ-బిదత్‌ విధానం భారత రాజ్యాంగ ఉల్లంఘణ కావున ఆ విధానాన్ని రద్దు చేయండని ఒక ముస్లిం యువతి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాజ్యాంగ ఆధారంగా నడుస్తున్న ప్రజా స్వామ్య దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న పద్ధతులను ఎలా అనుమతిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించింది. ఆమె చెప్పిన వివ రణతో ఏకీభవించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆ విషయంపై నిర్ణయాన్ని మాత్రం మోదీ సర్కార్‌ ముందుకు తోసింది. తలాక్‌ విధానంపై ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోడంటూ కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తన భర్త పెట్టిన గృహ హింసను అడ్డుకున్నందుకు తనకు తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చానని చెబుతున్నాడని షాయిరా భాను సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసింది. భారత రాజ్యంగంలోని ఆర్టికల్స్‌14, 15, 21 ప్రకారం తలాక్‌-ఏ-బిదత్‌, నిఖా హలలా, బహుభార్యతత్వం పూర్తిగా వ్యతిరే ఖమని ఆమె కోర్టుకు వివరించారు. ఆ మేరకు రాజ్యాంగ ప్రతులతో పాటు ఈ మద్య కాలంలో ఖురాన్‌పై జరిపిన రీసర్చ్‌ (పీహెచ్‌డీ స్కాలర్‌) పత్రాలను ఆమె కోర్టుకు సమర్పించారు. అదే తరుణంలో దేశంలో తలాఖ్‌ విధానం ద్వారా ముస్లిం మహిళలు పడుతున్న అవస్థలను కోర్టు ముందుంచారు. ఆమె పిటిష న్‌తో పాటు విన్పించిన వాదనతో కోర్టు ఏకీభివించింది. ముఖ్యంగా ఆమె భర్త ఆమెకు తలాక్‌ చెప్పడాన్ని కోర్టు తప్పుబట్టింది.

ఇదిలా ఉండగా గత నెలలో ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘడ్‌ జిల్లా అదనపు న్యాయమూర్తి జస్టిస్‌ మహ్మద్‌ జహీరుద్దీన్‌ సిద్దీఖీ కోపంతో ఊగిపోతూ మూడు పర్యాయాలు తలాక్‌ చెప్పి భార్యను ఇంటి నుంచి బయటకు పంపించాడు. ఇదెక్కడి న్యాయం భారత దేశంలో ఉంటున్న నేను భర్త తోడిదే జీవితం అనుకుంటే హఠాత్తుగా తలాక్‌ చెప్పి పంపేశాడు. ఇప్పుడు నేనేమి చేయాలి అయినా ఇంత ఈజీగా వివాహ బంధాన్ని తెంపాడానికి ఇదేం ముస్లిం దేశం కాదు మహిళను గౌరవించే భారత దేశం కాదా అని బాధత మహిళ ప్రశ్నించింది. ఆమె ప్రశ్నించింది ఎవరినో కాదు ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రశ్నించింది. భారత దేశ మహిళకు ఉన్న స్థానం ఇదేనా అన్న ప్రశ్నిస్తూ ఆమె సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌, అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మతీన్‌ అహ్మద్‌లకు లేఖ రాసింది. ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘడ్‌ జిల్లా అదనపు న్యాయమూర్తి జస్టిస్‌ మహ్మద్‌ జహీరుద్దీన్‌ సిద్దీఖీ రెండవ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక అదే అదనులో ఆమెకు మూడు పర్యాయాలు తలాక్‌ చెప్పాడు. దీంతో ఆమె సుప్రీం కోర్టు సీజెకు అలహాబాద్‌్‌ సీజేకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసింది. ముస్లిం వివాహ చట్టం ముస్లిం దేశాలకు సరిపోతుంది. కాని మహిళలను గౌరవించే భారత దేశంలో సరిపోతుందా అని ఆమె ప్రశ్నించింది. అదే విధంగా హఠాత్తుగా తలాక్‌ చెబితే సదరు మహిళ పరిస్థితి ఏమిటో తెలుపండి అంటూ ఆమె న్యాయమూర్తులను కోరింది. ఆ విధంగా తలాక్‌ విదానంపై తరచుగా కోర్టులలో వ్యాజ్యం నడుస్తోంది. ఆ సమస్యపై న్యాయవ్యవస్థ దృష్టి ఉంది. తాజాగా తలాక్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ ఫాయిరా భాను పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్‌ ఆర్‌ దావే, జస్టిస్‌ ఏకే.గోయల్‌ లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటీషనర్‌ వాదనతో ధార్మసనం ఏకీభవించింది. అయితే దేశ రాజ్యాంగం, చట్టాలకు సంబంధించిన అంశం మాత్రమే కాక మత విశ్వాసాలకు సంబంధించిన విషయం కావడంతో ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ధార్మసనం సూచించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. భారత దేశంలో ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసినట్లు షాయిరా భాను చెప్పారు. అదే క్రమంలో దేశ చట్టాలలో మార్పులు వచ్చేవరకు ఆమె పోరాటం చేస్తానని వివరించారు.