తలసరి ఆదాయం పెరిగేలా ప్రణాళిక

AP MINISTER YENAMALA
AP MINISTER YENAMALA

తలసరి ఆదాయం పెరిగేలా ప్రణాళిక

విజయవాడ: ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు సూచించారు. 2017-18కి సంబంధించిన సామాజిక ఆర్ధిక సర్వే తయారిపై ప్రణాళికశాఖ అధికారులతో శనివారం విజయవాడలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. వ్యవ సాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు వృద్ధి రేటు బాగుందని, పరిశ్రమల వృద్ధిరేటు దేశ వ్యాప్తంగా మందగించిందని రాష్ట్రంలో కూడా ఆశించిన స్ధాయిలో వృద్ధిరేటు సాధించలేక పోయామని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. సర్వీస్‌ సెక్టార్‌లో వృద్ధి రటు ఆశాజనకంగా ఉందని తెలిపారు. భారీ, మధ్యతరహా పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావ డానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. మధ్య, చిన్న మరియు సూక్ష్మ తరహా పరిశ్రమల అభివృద్ధి ప్రభుత్వం తగిన ప్రోత్సాహ కాలు ఇస్తుందని యనమల పేర్కొన్నారు.