తమ సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకండి: చైనా ఆర్మీ

china army
china army

బీజింగ్‌: తమ మిలటరీ సామర్థ్యాలను తక్కవ అంచనా వేసి కలలు కనకండి అంటూ చైనా రక్షణశాఖకు చెందిన అధికారులు
భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ‘పర్వతాన్ని కదిలించడం సులువు కావచ్చు కాని తమ లిబరేషన్‌ ఆర్మీని కదిలించడం
చాలా కష్టం అని వారు అన్నారు. అంతేకాకుండా భారత్‌ తన తప్పును సరిదిద్దుకోవాలంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత
కొన్ని రోజులుగా సరిహద్దు వివాదంతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది.