తమ పార్టీని ఎవరూ దెబ్బ తీయలేరు: పళనిస్వామి

palani swami
palani swami

చెన్నై: అధికారంలో ఉన్న అన్నాడిఎంకెను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్న దినకరన్‌ చేసిన సవాల్‌పై తమిళనాడు సియం పళనిస్వామి  సమాధానమిస్తూ ఎంత మంది దినకరన్‌లు వచ్చినా తమ పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. ఈ రోజు చెన్నైలోని వనగరంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని దెబ్బ తీయటం ఎవరితరం కాదని, తమ ప్రభుత్వానికి పూర్తి బలం ఉందని, బల నిరూపణకు తాము ఎప్పుడైనా సిధ్ధమని ధీమా వ్యక్తం చేశారు.