తమ పార్టీకి 140స్థానాలు వస్తాయి: లోకేశ్‌

lokesh
lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్‌ పలు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్‌ ఛానల్‌కు
ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఏపీలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి
140స్థానాలు వస్తాయని, అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఒకరిద్దరు చేసిన
తప్పులకు అందరిని బాధ్యులను చేయలేమని, వైకాపా నుంచి తమ పార్టీలోకి వచ్చిన నాయకులందరికీ సీట్ల
సర్దుబాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నియోజక వర్గాల పునర్విభజన ఆంశంపై మాట్లాడిన
ఆయన నియోజక వర్గాల పునర్విభజన జరగదని ఎవరు చెప్పారు? రాజ్యాంగ సవరణ మాత్రమే చేయాలని
మాత్రమే చేయాలని చెప్పారని ఆయన స్పష్టం చేశారు.