తమిళ, కన్నడంలో దూసుకెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రాజా

Express raja
శర్వానంద్‌, సురభిలు జంటగా యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్‌లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌ రాజా విడుదల రోజు నుండి పాజిటివ్‌ టాక్‌తో పాటు శర్వానంద్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ రెవిన్యూతో సూపర్బ్‌ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సంక్రాంతి బరిలో భారీ కాంపిటేషన్‌తో విడుదలయ్యియ మొదటి లాభాలు తెచ్చుకున్న చిత్రంగా ముందొరసలో ఉంది. ఈ రోజు (22జనవరి) తమిళం, కన్నడ భాషల్లో విడుదలయ్యింది. అంతేకాకుండా భారీ ఓపెనింగ్స్‌ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆంద్రా, తెలంగాణాలో 150 థియేటర్స్‌ రెండవ వారంలో పెంచటం విశేషం. అవన్నీ హౌస్‌పుల్‌ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రత్యేకంగా సంక్రాంతికి పూర్తి వినోదంతో వచ్చిన చిత్రంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఘన విజయాన్ని అందించారు. ఈ అఖండ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికి చిత్ర యూనిట్‌ ధన్యవాదాలు తెలిపారు. మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలు అందుకున్నారు. అంతేకాకుండా స్క్రీన్‌ప్లే కొత్తగా ఉండటంతో ఆడియన్స్‌ థ్రిల్‌ ఫీలయ్యారు. మొదటి 10 నిమిషాలు సినిమా మిస్‌ కాకూడదని ముందు నుండి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే చిత్రంలో కూడా మొదటి పది నిమిషాలు కీ రోల్‌ ప్లే చేయడం ఇప్పటి వరకూ తెలుగులో రాలేదని చెప్పటం విశేషం. శర్వానంద్‌ స్టైల్‌ అండ్‌ ఫెర్‌ఫార్మ్‌న్స్‌ చాలా కొత్తగా ఉంది. సురభి నటన అందం చాలా ప్లస్‌ అయ్యాయి. అలాగే సప్తగిరి, షకలక శంకర్‌, ధనరాజ్‌, పోసాని కష్ణమురళి మరియు బ్రహ్మజిల పాత్రల పేర్లే చిత్రంలో చక్కిలిగింతలు పెట్టాయి. సినిమాకి హైలెట్‌ కామెడి అని చెప్పుకోవాలి.