తమిళనాడులో తృతీయ కూటమికి అవకాశం?

చెన్నై: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, వచ్చే ఏడాదిలో లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో అన్నాడిఎంకె, డిఎంకెలు రెండు కూటములుగా ఎన్నికల బరిలో నిలుస్తాయని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్ తీరు ఒకింత ఆసక్తి కరంగా ఉంది. ఇద్దరికీ కరుణానిధి విగ్రహావిష్కరణకు ఆహ్వానం అందినా రజనీకాంత్ మాత్రమే హాజరయ్యారు. కమల్ హాసన్ దూరంగా ఉన్నారు. బిజెపిని అభిమానించే రజనీ ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై భిన్నంగా స్పందించారు. బిజెపిని వ్యతిరేకించే కమల్ డిఎంకే-కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్రలో తృతీయ కూటమికి అవకాశాలు ఉన్నాయన్న చర్చ మొదలైంది.