తమిళంలో మాట్లాడి ఆకట్టుకునే ప్రయత్నం చేసిన పవన్‌

pawan
pawan

చెన్నై: తమిళనాడు పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్‌ అక్కడి మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అంటూ తమిళంలో ప్రసంగిస్తూ తనను తాను పరిచయం చేసుకుంటూ తన పేరు పవన్‌ కళ్యాణ్‌ అని 2014లో జనసేన పార్టీ ప్రారంభించిన విషయాన్ని తెలియజేశారు. తన తమిళంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని విన్నవించుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా జనసేన వాణి వినిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జాతీయ పార్టీల తీరు బాలేదని బిజెపిని, కాంగ్రెస్‌ణు దుయ్యబట్టారు.