తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు: సిట్‌ అధికారులు

charmi
charmi

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా సినీ నటి ఛార్మి నిన్న సిట్‌ కార్యాలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ
విధులు నిర్వహిస్తున్న భద్రత సిబ్బంది అత్యుత్సాహం వివాదస్పదమైంది. ఛార్మి హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు అక్కడ మహిళ
సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కొంత తోపులాట జరగడంతో మహిళ సిబ్బంది ఉన్నప్పటికి ఒక పురుష కానిస్టేబుల్‌ ముందుకొచ్చి
తాకడంతో చార్మి కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఆ కానిస్టేబుల్‌పై ఛార్మి ఫిర్యాదు చేసినట్టు వార్తలోచ్చాయి. దీనిపై అధికారులు విచారణకు
కూడా అదేశించారు. అయితే ఈ రోజు ముమైత్‌ఖాన్‌ విచారణ అనంతరం అధికారులు మాట్లాడుతూ ఈ ఘటనపై ఛార్మి తమకు ఎలాంటి ఫిర్యాదు
చేయలేదని తెలియజేశారు.