తన నివాసంలో రంజాన్‌ వేడుక

PAWAN
PAWAN

హైదరాబాద్‌: రంజాన్‌ పండగ సందర్భంగా ముస్లింలకు జనసేన పార్టీ అధినేత పవన్‌ శుభాకారక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ట్వీట్‌ చేస్తూ తన సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో రంజాన్‌ పండగ జరుపుకున్నానని తనపై ప్రేమ చూపించే ప్రతి ఒక్కరికి ఈ రోజున తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి దిగిన ఫోటోను ఆయన పోస్ట్‌ చేశారు.