తనీష్‌ ఓ ‘దేశ దిమ్మరి’

Taneesh
Taneesh

తనీష్‌ ఓ ‘దేశ దిమ్మరి’

సవీణ క్రియేషన్స్‌ పతాకంపై బాలీవుడ్‌నిర్మాత సాని గోయల్‌ నిర్మిస్తున్న చిత్రం ‘దేశ దిమ్మరి.. నరేష్‌ నారదాశి దర్శకత్వంలో తనీష్‌ హీరోగా రూపొందనున్న ఈచిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుటోంది.. సుభాష్‌ ఆనంద్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో సుమన్‌, ముకుల్‌ దేవ్‌, ఫిష్‌ వెంకట్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

దర్శకుడు నగేష్‌ నారదాశి మాట్లాడుతూ, మానవత్వ విలువలను చాటిచెప్పే చిత్రమిదనిఅన్నారు. ప్రకృతి అవసరాలను తీరుస్తుంది తప్ప. అత్యాశను కాదు అనే సిద్ధాంతాన్ని నమ్మే ఓ యువకుడి కథే ఈచిత్రమన్నారు. ఈ దేశ దిమ్మరి డబ్బుతో అవసరం లేకుండా జీవనం సాగించే ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పంజాబ్‌ హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌లో షూటింగ్‌ చేశాం.. పోస్టు ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామన్నారు.