తదుపరి టి-సీఎస్‌ ఎస్కే జోషి?

Telangana
Telangana

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రస్తుత ఎస్పీ సింగ్‌ పదవీ కాల నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఆ బాధ్యతను ఎవరికి అప్పగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ సింగ్‌ పదవీ కాలాన్ని పొడిస్తారా? లేదా కొత్తవారికి అవకాశమిసాతరా? అనేది తేలాల్సిం ఉంది. సీఎస్‌ రేసులో పలువురు ఐఏఎస్‌లు ఉన్నప్పటికీ ఎస్కే జోషి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ ఎస్పీ సింగ్‌ పదవీకాలాన్ని పొడిగించకపోతే ఆయన సేవలను మిషన్‌ భగీరథకు సలహాదారుగానో లేదంటూ మరోరూపంలో ఉపయోగించుకుంటారనే ప్రచారం జరుగుతోంది.