తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్‌

Ravi Teja
మాస్‌ మహారాజ్‌ రవితేజ నుండి వచ్చిన బెంగాల్‌ టైగర్‌ సినిమా డిసెంబరు 10న రిలీజ్‌ అయ్యి మాస్‌ ఎంటర్టైనర్‌ అనిపించుకొన డీసెంట్‌ హిట్‌గా నిలిచింది.. ఈ సినిమా రిలీజ్‌కి ముందే రవితేజ మరో మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అందులో మొదటిది సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో చేయనుంటే, రెండవది దిల్‌రాజు వేణు శ్రీరాం కాంబినేషన్‌లో రానున్న ఎవడో ఒకడు. ఈరెండు కాకుండా చక్రి అనే కొత్త డైరెక్టర్‌ని పరిచయం చేస్తూ ఓ సినిమాని చేయడానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన అన్ని ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతాయి. ఈ సినిమాకి ప్రొడక్షన్‌ హౌస్‌ అయిన రంజిత్‌ మూవీస్‌ వారు రీసెంట్‌గా ఫీల్మ్‌ ఛాంబర్‌లో రిజిష్టర్‌ చేశారు. రవితేజ చక్రి సినిమా కోసమే రాబిన్‌ హుడ్‌ అనే టైటిల్‌ని రిజిష్టర్‌ చేశారని సమాచారం. హాలీవుడ్‌లో బాగా ఫేమస్‌ అయిన ఈ పేరుని కిక్‌ 2లో కూడా రవితేజ పాత్రకి వాడుకున్నారు. ఇప్పుడు రవితేజ తన సినిమాకే ఈ టైటిల్‌ని సెలక్ట్‌ చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. అలాగే ఈ సినిమాలో హాట్‌ బ్యూటీ అయిన అమీ జాక్సన్‌ని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అమీ కిట్టిలో పలు సినిమాలు ఉన్నాయి. వీరు అడిగే డేట్స్‌కి తన కాల్షీట్‌స అడ్జస్ట్‌ చేయగలమా లేదా అనే సందిగ్దంలో ఉంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా ఫైనల్‌ అయ్యే అవకాశం ఉంది.