తండ్రి గురించి చాలా ఉద్వేగంగా..

Jr NTR with Hari  Krishna
Jr NTR with Hari Krishna

ముఖ్యంగా చిన్నతనంలో నందమూరి కుటుంబం నుంచి ఆశించిన స్థాయిలో ఆదరవు పొందని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎక్కువగా ఫీలవుతున్నారు జనాలు. తండ్రీ కొడుకుల కథతో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసిన తారక్.. ఆ చిత్ర ఆడియో వేడుకలో తన తండ్రి గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడిన మాటల్ని అభిమానలు ఇప్పుడు గుర్తు చేసుకుని మరింతగా ఆవేదన చెందుతున్నారు.

నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు ధైర్యం చెప్పి వెన్ను తట్టి పంపి.. నా మీద నాకు నమ్మకం కలిగేలా చేసింది మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు. నాన్న ఎప్పుడూ మా ముగ్గురు సోదరులకీ ఒకటే చెప్పేవారు. ‘కింద పడండి.. చావుదాకా వెళ్లిపోండి. కానీ మిమ్మల్ని మీరు నమ్ముకుని పైకి రండి’ అని చెప్పారు. ఆయన ఏ రోజూ పిరికి పందల్లా బతకడం మాకు నేర్పించలేదు. ఆయన పేరు తాతగారి పేరు చెప్పుకొని బతకడం నేర్పలేదు. ‘మీకు మీరుగా బతకండి. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అనేవారు. ఇది సుకుమార్ నాన్న గారి కథ. ఈ కథ చెప్పినప్పుడు భయపడ్డా. మా నాన్నకు ఏదైనా అయిపోతుందంటే నేను ఊహించుకోలేను. మనిషిని మామూలుగా ఉండలేను.