తండాలను పంచాయతీలుగా మారుస్తాం: మంత్రి హరీష్‌

Harish Rao
Harish Rao

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో 47తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. కాగా, నేడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండల పరిధిలో గల కసర్‌గుత్తిలో 30 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. నారాయణఖేడ్‌లో ఐసియు,  డయాలసిస్‌ కేంద్ర ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తదనంతరం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు, కెసిఆర్‌ కిట్‌ వివరాలను మంత్రి హరీష్‌రావు ఆస్పత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.