ఢిల్లీ భారీ అగ్నిప్రమాదం 9మంది మృతి

Karol Bagh hotel fire doused, 9
Karol Bagh hotel fire doused, 9

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో కరోల్‌బాగ్‌ ప్రాంతంలోని అర్పిత్‌ ప్యాలెస్‌ హోటల్‌లో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈసంఘటనలో మంటల్లో చిక్కుకుని 9మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 26 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను ఆర్పారు. ఉదయం 7 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. మొత్తం 35 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గాయపడిన వారిని ఇక్కడి రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒక చిన్నారి, మహిళ ఉన్నారు. మృతులంతా ఊపిరాడక మరిణించినట్లు తెలుస్తోంది.