ఢిల్లీ టీమ్‌లో స‌రైన బౌల‌ర్లు లేరు

GAUTAM GAMBHIR
GAUTAM GAMBHIR

న్యూఢిల్లీః ఢిల్లీ టీమ్ ఐపీఎల్ నుంచి బయటకెళ్లిపోయినప్పటి నుంచి గంభీర్‌ను ఎక్కడికెళ్లినా ఓ ప్రశ్నతో వేధిస్తున్నారు. మీరెందుకు మళ్లీ ఆడలేదు అని. దీనికి సింపుల్‌గా గంభీర్ ఇచ్చిన సమాధానం.. టీమ్‌లోకి తీసుకుంటే ఆడేవాడిని అని. ఈ సీజన్‌లో రబాడా, మోరిస్‌లాంటి కీలక ప్లేయర్స్ గాయాలతో దూరం కావడం, సరైన తుది జట్టును ఎంపిక చేయకపోవడం, కొందరు ప్లేయర్స్ సరిగా ఆడలేకపోవడం, అసలు సమయాల్లో బోల్తా పడటం టీమ్ కొంప ముంచిందని గంభీర్ చెప్పాడు. అయితే ఏ ఫార్మాట్ అయినా బౌలర్లే మ్యాచ్‌లను గెలిపిస్తారని, ఢిల్లీ టీమ్‌లో సరైన బౌలర్లే లేక దారుణంగా విఫలమైందని అతను అభిప్రాయపడ్డాడు.