ఢిల్లీలో ప‌వ‌న్ నిర‌వ‌ధిక నిరాహార‌దీక్ష‌!

PAWAN KALYAN
PAWAN KALYAN

హైద‌రాబాద్ః కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్‌లోనూ, బయటా ఎంపీలు పోరాటం చేస్తున్నా..కేంద్రం పట్టించుకోకపోవడంతో ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని పవన్‌కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వైఖరిని నిరసిస్తూ జంతర్‌మంతర్ వేదికగా ఈ దీక్ష చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో పవన్‌కల్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో మోదీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్…మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.