ఢిల్లీలో నాలుగు వేలు దాటిన కరోనా కేసులు

64 మంది మృతి

saatyendra jain

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ మరింతగా పెరిగింది. గడచిన 24 గంటలలో కోత్తగా మరో 384 కరోనా కేసులు నమోదు అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. దీంతో ఢిల్లీలో కరోనా భాధితుల సంఖ్య 4,122 కు చేరుకుందని అన్నారు. కాగా కరోనా కారణంగా ఇప్పటి వరకు రాజధానిలో 64 మంది మృతి చెందారు. కాగా కరోనా బారినుండి 1,256 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా విజృంభణ నేపథ్యంలో మంత్రి ప్రతి ఒక్కరు తప్పకుండా సామాజిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్కులు ధరించాలని తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/