ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ గాంధీ చర్చలు

RAHUL GANDHI
RAHUL GANDHI

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలో మహాకూటమి ఏర్పాటు, సీట్ల పంపకాల విషయంలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన బిహార్‌తో పాటు పలు రాష్ట్రాల నేతలతో చర్చించనున్నారు. ఇందులో ఇతర కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ)‌, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఇటీవల కుష్వాహా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్డీఏపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు రాహుల్‌తో చర్చలు జరిపి తాము మహాకూటమిలో భాగస్వామి అవుతామన్న ప్రకటన చేసే అవకాశం  ఉన్నట్లు సమాచారం.