ఢిల్లీకి బయల్దేరిన కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ ఈరోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ వివాహ వేడుకల్లో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. తరువాత తిరిగి ఇవాళ రాత్రికి హైదరాబాద్కు వస్తారు.