ఢిల్లీకి బయలుదేరిన టి.కాంగ్రెస్‌ నేతలు

congress
congress

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు కుంతియా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, సీఎల్పీ నేత జానారెడ్డి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు దిల్లీకి వెళ్లారు. ఈరోజు జరిగే ఏఐసీసీ స్టీరింగ్‌ కమిటీలో పొత్తుల ఖరారుకు సంబంధించి పెండింగ్‌ ఉన్న నియోజకవర్గాలపై నేతలు చర్చించనున్నారు. మహా కూటమి సీట్ల సర్దుపాటు అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు  సమాచారం.