ఢిల్లీకి, గ‌ల్లీకి బేరాలు కుద‌ర‌క‌నే వైసీపీ ఆవిర్భవించిందిః మంత్రి దేవినేని

AP Minister Devineni Uma
AP Minister Devineni Uma

విజ‌య‌వాడః వైసీపీ నేత బొత్సా సత్యనారాయణ చేసిన ఆరోపణలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. పోల‌వరం పనుల్లో అవినీతి చోటుచేసుకుందంటూ వైకాపా చేసిన ఆరోప‌ణ‌ల‌పై మంత్రి మీడియాతో మాట్లాడుతూ అవినీతి నేతల పార్టీ వైసీపీ అని, వోక్స్ వ్యాగన్ దొంగ బొత్స అని నిప్పులు చెరిగారు. పోలవరం పవర్ ప్రాజెక్టు కొట్టేద్దామని చూశారని,  పవర్ ప్రాజెక్టు బేరం కుదిరుంటే అసలు వైసీపీ పుట్టేదే కాదన్నారు. ఢిల్లీకి, గల్లీకి బేరాలు కుదరకనే వైసీపీ ఆవిర్భవించిందని, ఇదే అంశంపై గతంలో జగన్‌ను సూటిగా ప్రశ్నించానని, దానిపై ఇంతవరకు సమాధానం చెప్పలేదని అన్నారు.