ఢిల్లి పోలీసులకు హైకోర్టు నోటీసులు

Delhi High Court
Delhi High Court

ఢిల్లి:  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లి హైకోర్టు విచారణ జరిపింది. ఈ అంశంలో ఢిల్లి పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 7వ తేదీలోగా సమాధానమివ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జర్వాల్‌కు బెయిల్‌ మంజూరు చేయడానికి తీస్‌ హజారీ కోర్టు తిరస్కరించడంతో ఆయన హైకోర్టను ఆశ్రయించారు.